భద్రాద్రి, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
భద్రాచలం పరిధిలోని ఐటీసీ కర్మాగారంలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. “యు.వి.ఆర్” కాంట్రాక్ట్ పరిధిలో చిప్పర్ హౌస్ విభాగంలో క్యాజువల్ కార్మికుడిగా పనిచేస్తున్న భద్రాచలానికి చెందిన ఓ కార్మికుడు విధులు నిర్వహిస్తున్న సమయంలో అనుకోకుండా కన్వేయర్‌లో పడిపోవడంతో కాలు విరిగిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే సిబ్బంది అప్రమత్తమై అతడిని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాదుకు తరలిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఐటీసీ కర్మాగారంలో భద్రతా ప్రమాణాలపై విమర్శలు ఉన్న నేపథ్యంలో మరోసారి ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం కార్మిక వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. బాధిత కార్మికుడికి న్యాయం చేయాలని స్థానికులు, కార్మిక సంఘాలు యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తున్నాయి.

إرسال تعليق