మణుగూరు నుంచి హైదరాబాద్, తిరుపతికి నూతన బస్సు సర్వీసులు

G Rajashekar
By -
0

 



EB NEWS /మణుగూరు: 


ప్రయాణికులు, భక్తుల సౌకర్యార్థం మణుగూరు ఆర్టీసీ డిపో నుంచి హైదరాబాద్, తిరుపతికి నూతన బస్సు సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు డిపో మేనేజర్ కె. శ్యాంసుందర్ తెలిపారు.


హైదరాబాద్ వెళ్లే ప్రయాణికుల కోసం మణుగూరు నుంచి బీహెచ్‌ఈఎల్‌కు ప్రతిరోజూ రాత్రి **7 గంటలకు, 8 గంటలకు, 9 గంటలకు** మూడు బస్సు సర్వీసులు నడుస్తాయని పేర్కొన్నారు.


అదేవిధంగా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తుల సౌకర్యార్థం మణుగూరు నుంచి తిరుపతికి **ప్రతిరోజూ మధ్యాహ్నం 3 గంటలకు** ప్రత్యేక బస్సు సర్వీసు అందుబాటులో ఉంటుందని తెలిపారు.


ప్రయాణికులు, భక్తులు ఈ నూతన బస్సు సర్వీసులను సద్వినియోగం చేసుకోవాలని డిపో మేనేజర్ కోరారు.


إرسال تعليق

0 تعليقات

إرسال تعليق (0)