అశ్వాపురంలో కలకలం.. ఘటనపై పోలీసుల దర్యాప్తు
EB NEWS/అశ్వాపురం:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం తుర్రం వారిగూడెం గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది.
గ్రామానికి చెందిన జర్పుల సువాలి (60) అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందారు. గుర్తుతెలియని దుండగులు ఆమె గొంతు నులిమి హత్య చేసి, ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను అపహరించినట్లు సమాచారం.
ఈ ఘటనతో గ్రామంలో కలకలం రేగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. హత్యకు గల కారణాలు, నిందితుల ఆచూకీపై దర్యాప్తు చేపట్టారు. నిందితులను గుర్తించేందుకు పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

