అశ్వాపురం అటవీ ప్రాంతంలో రోడ్డు ప్రమాదం – పినపాక యువకుడికి తీవ్ర గాయాలు



 EB NEWS /అశ్వాపురం:

అశ్వాపురం మండలం మొండికుంట అటవీ ప్రాంతంలో ద్విచక్ర వాహనం అదుపు తప్పి పడిపోయిన ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పినపాక మండలం ఉప్పక గ్రామానికి చెందిన కండె నవీన్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి.


సమాచారం మేరకు, నవీన్ తన ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తుండగా మొండికుంట అటవీ ప్రాంతంలో ఒక్కసారిగా వాహనం నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కకు పడిపోయింది. ప్రమాదంలో ఆయనకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వెంటనే స్పందించి ఆసుపత్రికి తరలించారు.

ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.


Post a Comment

కొత్తది పాతది