పినపాక: పంచాయతీ కార్యదర్శి, కాంట్రాక్టర్ పరస్పర ఫిర్యాదులు

G Rajashekar
By -
0



EB NEWS/పినపాక:


 పంచాయతీ కార్యదర్శి, కాంట్రాక్టర్ మధ్య వివాదం చోటుచేసుకుంది. ఈ వ్యవహారంలో ఇరువర్గాలు పోలీసులను ఆశ్రయించి పరస్పరం ఫిర్యాదులు చేసినట్లు తెలుస్తోంది.

పంచాయతీ కార్యదర్శి ఫిర్యాదు ప్రకారం సెప్టెంబర్ 21న పంచాయతీ కార్యాలయంలో విధుల్లో ఉండగా ఒక కాంట్రాక్టర్ తనతో దురుసుగా ప్రవర్తించి, దుర్భాషలాడుతూ బెదిరించి దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించారని పేర్కొంటూ చర్యలు తీసుకోవాలని కోరారు.

మరోవైపు కాంట్రాక్టర్ తన ఫిర్యాదులో పంచాయతీ పనులకు సంబంధించిన బిల్లుల విషయంలో సమస్యలు తలెత్తాయని, ఈ క్రమంలో కార్యదర్శి తనతో దురుసుగా ప్రవర్తించి బెదిరించడంతో పాటు తనపై కూడా దాడి చేశారని ఆరోపించారు.

ఇరువర్గాల ఫిర్యాదులపై పోలీసులు విచారణ చేపట్టి, అసలు వివాదానికి కారణం ఏంటి? ఘటన ఎలా జరిగింది? అనే విషయాలపై స్పష్టత ఇవ్వాల్సి ఉంది.

إرسال تعليق

0 تعليقات

إرسال تعليق (0)