🚨 పినపాకలో ఘోర రోడ్డు ప్రమాదం... యువకుడు మృతి



EB NEWS/పినపాక

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుని ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.


పినపాక మండలం పోతురెడ్డిపల్లి వద్ద బయ్యారం మసీదు సమీపంలో లారీ-ఆటో ఢీకొన్న ఘటనలో సంజయ్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. 


ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు సహాయక చర్యలు చేపట్టినా ఫలితం లేకుండా పోయింది. ఈ ఘటనతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.


సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.




Post a Comment

కొత్తది పాతది