మంత్రి పొంగులేటి అనుచరుడి కారుపై రాళ్ల దాడి

G Rajashekar
By -
0

 



EB NEWS/ఖమ్మం: 


తిరుమలాయపాలెం మండలం సుద్దవాగుతండా గ్రామ శివారులో సోమవారం రాత్రి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు రామసహాయం నరేష్ రెడ్డికి చెందిన కార్లపై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేసినట్లు సమాచారం.


మండలంలోని వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేసిన గణేశ్ మండపాలను సందర్శించి పూజా కార్యక్రమాల్లో పాల్గొని తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. దాడిలో కార్లకు నష్టం జరిగినట్లు సమాచారం.


సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. దాడికి పాల్పడిన వ్యక్తులు ఎవరు? కారణాలు ఏమిటన్న దానిపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

إرسال تعليق

0 تعليقات

إرسال تعليق (0)