పినపాకలో ఘోర రోడ్డు ప్రమాదం – యువకుడికి తీవ్ర గాయాలు





EB NEWS/పినపాక:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలోని బయ్యారం క్రాస్ రోడ్ వద్ద బుధవారం హెచ్పి పెట్రోల్ బంక్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు, ద్విచక్ర వాహనం పరస్పరం ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.


ఈ ఘటనలో  ఉప్పాక గ్రామానికి చెందిన తరుణ్ (24) తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అంబులెన్స్ సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకుని బాధితుడికి ప్రథమ చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం సమీప ఆసుపత్రికి తరలించారు.


 సమాచారం అందుకున్న పోలీసులు కూడా ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలిస్తూ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.



Post a Comment

కొత్తది పాతది