EB NEWS/భద్రాద్రి:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట–ఖమ్మం జాతీయ రహదారిపై గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ, ట్రాక్టర్, ఆటో పరస్పరం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
ఈ దుర్ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదంలో మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
గాయపడిన వారిని స్థానికులు వెంటనే అశ్వారావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

