నడిరోడ్డుపై కారు బోల్తా.. బాధితులను కాపాడిన బండి సంజయ్

G Rajashekar
By -
0

 



EB NEWS/గజ్వేల్: 


గజ్వేల్ శివారులో కారు డివైడర్‌ను ఢీకొని పల్టీలు కొట్టిన ఘటనలో గాయపడిన వారిని కేంద్ర మంత్రి బండి సంజయ్ స్వయంగా రక్షించి మానవత్వం చాటుకున్నారు. సిరిసిల్లకు వెళ్తున్న సమయంలో ప్రమాదాన్ని గమనించిన ఆయన వెంటనే తన భద్రతా సిబ్బందితో కలిసి సహాయక చర్యలు చేపట్టారు.


ప్రమాదంలో కారులో చిక్కుకున్న భార్యాభర్తలతో పాటు తీవ్రంగా గాయపడిన వారి కుమార్తెను బయటకు తీసేందుకు బండి సంజయ్ సహకరించారు. అనంతరం క్షతగాత్రులను పోలీసు వాహనంలో ఆసుపత్రికి తరలించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు.


కారు పల్టీలు కొట్టిన సమయంలో ఎయిర్‌బ్యాగ్‌లు తెరుచుకోవడంతో ప్రయాణికులకు పెద్ద ప్రాణనష్టం తప్పినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించి బాధితులకు సహాయం చేసిన బండి సంజయ్ తీరుపై స్థానికులు అభినందనలు వ్యక్తం చేశారు.

إرسال تعليق

0 تعليقات

إرسال تعليق (0)