క్రీడాకారుల నైపుణ్యాన్ని వెలికి తీయడమే సీఎం కప్

 



సీఎం కప్ క్రీడలను ప్రారంభించిన ఎంపిడీఓ,ఉప సర్పంచు


కరకగూడెం , ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


గ్రామ స్థాయి క్రీడాకారుల నైపుణ్యాన్ని వెలికి తీసి,రాష్ర్ట స్థాయి వరకు పంపిచడమే లక్ష్యంగా సీఎం కప్ నిర్వహిస్తున్నామని మండల ఎంపీడీఓ మొడుగు దేవవరకుమార్ అన్నారు. 

కరకగూడెం మండలంలోని సమత్ మోతె క్లస్టర్ గుడ్ల రంజిత్ కుమార్ ఆధ్వర్యంలో క్లస్టర్ సంబంధించి గొల్లగూడెం,కొత్తగూడెం పంచాయతీల్లో సీఎం కప్ క్రీడల్లో భాగంగా ఎంపీడీవో,ఉపసర్పంచుల చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించడం జరిగింది.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...గ్రామీణ యువత,చదువుల తోపాటు క్రీడారంగంలో ముందుకు సాగాలని,క్రీడల్లో మంచి ప్రతిభను కనబరిచి మన గ్రామానికి మన మండలానికి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో మండల ఎంఈఓ గడ్డం మంజుల,పంచాయతీ సెక్రటరీ జిమ్మిడి విజయ్,ఈసాల సురేష్,ఎంపీ ఓ మారుతి,ఉప సర్పంచులు ఇర్ప కుశేలుడు,కొమరం నాగేష్,పాఠశాల హెచ్ఎం రాధ,పీడీ బాలరాజు,వార్డుమెంబర్స్,క్రీడాకారులు,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

أحدث أقدم