TG, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
బీఆర్ఎస్ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేల వ్యవహారం సుప్రీంకోర్టు ముంగిట మరో కీలక మలుపు తీసుకుంది. ఈ కేసులో తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ వ్యవహారంలో ఇప్పటికే కేటీఆర్ దాఖలు చేసిన ప్రధాన పిటిషన్‌తో మహేశ్వర్ రెడ్డి పిటిషన్‌ను జత చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టిన్ జార్జ్‌ల ధర్మాసనం ఈ కీలక ఆదేశాలు జారీ చేసింది.
ఫిరాయింపులపై స్పీకర్ నిర్ణయాల చట్టబద్ధతపై ఇప్పుడు దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టత ఇవ్వనుంది. రాజకీయంగా కీలకమైన ఈ కేసు తెలంగాణ రాజకీయాల్లో మరింత చర్చకు దారితీస్తోంది. ఈ వ్యవహారంపై తదుపరి విచారణను సుప్రీంకోర్టు ఫిబ్రవరి 6కు వాయిదా వేసింది.

إرسال تعليق