మణుగూరు, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
మణుగూరు మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో.. సర్పంచులకు ఇస్తున్న శిక్షణ తరగతులు.
ప్రజల కోసం.. ప్రజా శ్రేయస్సు కోసం.. పంచాయితీ అభివృద్ధి కోసం.. పాలన విధానాన్ని అవలంభించడం కోసం.. పంచాయితీ ప్రజలకు సుపరిపాలన అందించుటకొరకు సోమవారం నుండి కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లాలోని ఇచ్చు సర్పంచ్ శిక్షణ తరగతులకు రెండోవరోజు హాజరైన మణుగూరు మండల పరిధిలోని అన్ని గ్రామ పంచాయితీ సర్పంచులు. ఈ సందర్భంగా సర్పంచులు మాట్లాడుతూ.. నాడు చదివిన చదువు వల్ల వ్యక్తిగతంగా ఎవరికి ఉపయోగ పడకపోవచ్చు ఏమోగాని, నేడు సర్పంచ్ గా గెలిచి ప్రజలకు, గ్రామ పంచాయితీ అభివృద్ధికి సేవ చేసే అదృష్టం ఒక వరంలా వచ్చింది. ఈ యొక్క అదృష్టాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకొని మా వంతు సహాయ సహకారాలు ప్రజలకు అందించాలనే ఉద్దేశ్యంతో ఈ యొక్క శిక్షణ తరగతులకు హాజరై మరెంతో అభివృద్ధి కి పంచాయితీ రాజ్ చట్టాలకు నిబంధనలకు లోబడి పని చేస్తామని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అశ్వాపురం ఎంపిఓ జి ముత్యాలరావు (ట్రైనింగ్ మాస్టర్), మణుగూరు మేజర్ పంచాయితీ సర్పంచ్ కలబోయిన మాధారావు (సమితి సింగారం), విప్పల సింగారం సర్పంచ్ పాల్వంచ రాములు, కూనవరం సర్పంచ్ ఏనిక స్వేత, ముత్యాలమ్మ నగర్ సర్పంచ్ జంపేశ్వరి, లంకమల్లారం సర్పంచ్ పూనెం రమేష్, కట్టుమల్లారం సర్పంచ్ జగిడి ప్రసాద్, గుట్టమల్లారం కారం పూజిత, తోగ్గుడెం మడకం క్రిష్ణ, పగిడేరు సర్పంచ్ కుంజ శ్రావణ్ కుమార్, సాంబాయిగూడెం సర్పంచ్ చిడెం ఉషారాణి, దమ్మక్కపేట సర్పంచ్ మడి స్వరూప, తిర్లపూరం పాయం చిట్టెమ్మ, రామనుజారం సర్పంచ్ కాలం కల్పన తదితరులు పాల్గొన్నారు.

إرسال تعليق