బూర్గంపహడ్: కస్తూర్బా పాఠశాలలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

G Rajashekar
By -
0

EB NEWS/బూర్గంపహడ్:


బూర్గంపహడ్ మండల కేంద్రంలోని కస్తూర్బా బాలికల పాఠశాలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో నిర్వహిస్తున్న రికార్డులను పరిశీలించి, హాస్టల్‌లో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని స్వయంగా పరిశీలించారు.


విద్యార్థులకు నాణ్యమైన, పోషకాహారంతో కూడిన భోజనం అందించడం అత్యంత ముఖ్యమని కలెక్టర్ అన్నారు. విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటేనే చదువుల్లో మెరుగైన ఫలితాలు సాధించగలరని పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం భోజనం అందించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.


మెనూ ప్రకారం భోజనం అందేలా పర్యవేక్షించాలని మండల తహసీల్దార్ ప్రసాద్‌ను కలెక్టర్ ఆదేశించారు. అనంతరం హాస్టల్‌లో ఉన్న వసతులు, భోజన నాణ్యత గురించి విద్యార్థులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.


ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ ప్రసాద్, ఎంపీడీఓ జమల రెడ్డి, గ్రామ ఉపసర్పంచ్ గుండె వెంకన్న తదితరులు పాల్గొన్నారు.


إرسال تعليق

0 تعليقات

إرسال تعليق (0)