ఖమ్మంలో దారుణం.. ఐదేళ్ల పసిబాలికపై 45 ఏళ్ల వ్యక్తి ఘాతుకం!



EB NEWS/ఖమ్మం:


ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని ఓ గ్రామంలో అమానుష ఘటన వెలుగుచూసింది. ఐదేళ్ల పసిబాలికపై 45 ఏళ్ల వ్యక్తి లైంగిక దాడికి పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర ఆగ్రహాన్ని రేపుతోంది. 


గ్రామంలోనే నివసిస్తున్న నిందితుడు, బాలిక తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయాన్ని గమనించి ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు సమాచారం. తీవ్ర గాయాలతో రక్తస్రావం అవుతుండటంతో బాలిక విషయం ఇంటికి వచ్చిన తల్లిదండ్రులకు తెలిపింది. వెంటనే వారు బాలికను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 


బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకునేందుకు చర్యలు చేపట్టారు. ఈ ఘటన గ్రామంలో తీవ్ర కలకలం రేపగా, నిందితుడికి కఠిన శిక్ష విధించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.


ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు. 


Post a Comment

أحدث أقدم