రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరించిన పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు

 

 


 మణుగూరు, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:



 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం ప్రజా భవన్ నందు రాష్ట్ర అవతరణ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్రం కోసం అమరులైన అమరవీరులకు నివాళులు అర్పించి మౌనం పాటించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన *MLA* *పాయం*  అనంతరం కార్యక్రమని ఉద్దేశించి తెలంగాణ రాష్ట్రం ఎన్నో ప్రాణ త్యాగాలతో సిద్ధించిందని నీళ్లు నిధులు నియామకాలు ప్రధానాంశాలతో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి చెందాలని తెలంగాణ రాష్ట్రం ఇస్తే తెలంగాణకు న్యాయం చేయాలని యూపీఏ చైర్పర్సన్ గా ఉన్నటువంటి సోనియాగాంధీ  నాయకత్వంలో రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ఇచ్చినటువంటి సోనియాగాంధీ  ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు, కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారి సారధ్యంలో ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు రైతు రుణమాఫీ, రైతు భరోసా, కింటాకి 500 రూపాయలు బోనస్, వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మయ్య భరోసా, నిరుద్యోగ యువతకు రాజీవ్ యువ వికాసం పథకం, మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం, 200 యూనిట్లు కరెంటు, అమలు చేస్తుందని తెలిపారు, అన్ని వర్గాల ప్రజలకు SC ST BC మైనారిటీ ప్రజల యొక్క సంక్షేమ కొరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం పాటుపడుతున్నారు తెలిపారు, పినపాక నియోజకవర్గ ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన *పినపాక శాసన సభ్యులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు*


 ఈ యొక్క కార్యక్రమంలో మణుగూరు మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పీరినాకి నవీన్, టౌన్ అధ్యక్షులు శివ సైదులు , నీలకంఠేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ కూచిపూడి బాబు , lNTUC సెక్రటరీ సామ శ్రీనివాస్ రెడ్డి గారు, పినపాక నియోజకవర్గ యూత్ ప్రెసిడెంట్ తరుణ్ రెడ్డి , మణుగూరు మండల మహిళా అధ్యక్షురాలు సౌజన్య , యూత్ ప్రెసిడెంట్ సతీష్ , గాండ్ల సురేష్ , బొగ్గు ముఠా అధ్యక్షులు నిరుడు రాంబాబు , కనకయ్య  మండల నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు అనుబంధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు

Post a Comment

أحدث أقدم