గోపాలరావుపేటలో అసలు ఏం జరుగుతుంది..? రాత్రికి రాత్రే దేవుళ్ల విగ్రహాలు వెలిసిన ఘటన చర్చనీయాంశం




 EB NEWS/పినపాక, ప్రతినిధి రాజశేఖర్:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలం, గోపాలరావుపేట గ్రామంలో అనూహ్యంగా చోటుచేసుకున్న ఒక ఘటన మండల వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గ్రామంలో కొత్తగా నిర్మాణం జరుగుతున్న ప్రభుత్వ పాఠశాల సమీపంలోని స్థలంలో రాత్రికి రాత్రే దేవుళ్ల విగ్రహాలు ప్రత్యక్షమయ్యాయి. గౌడ సంఘం ఆధ్వర్యంలో ఈ విగ్రహాలను ఏర్పాటు చేసినట్లు సమాచారం.


ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఒక వైపు ఆ స్థలం ప్రభుత్వ భూమి అని అధికారులు చెబుతుండగా, మరోవైపు కొందరు గ్రామస్తులు తమ వాదనలు వినిపిస్తున్నారు. దీంతో అక్కడ పరిస్థితి కాస్త ఉద్రిక్తంగా మారినట్లు తెలుస్తోంది.


ఈ విషయం తెలుసుకున్న అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఆ భూమి అసలు ఎవరిదీ? ప్రభుత్వానిదా లేక ఇతరుల హక్కులు ఉన్నాయా అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది.


ప్రస్తుతం గ్రామంలో ఈ ఘటనపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. రాత్రికి రాత్రే విగ్రహాలు ఎలా ఏర్పాటు చేశారు? దీనికి వెనుక ఉన్న కారణాలు ఏమిటి? అనే విషయాలపై గ్రామస్తులు, అధికారులు స్పందన కోసం ఎదురుచూస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Post a Comment

أحدث أقدم