EB NEWS/బూర్గంపాడు ప్రతినిధి రాజశేఖర్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బూర్గంపాడు మండలం నకిరేపేట పరిధిలో రైతులకు ఆనందం కలిగించే పరిణామం చోటుచేసుకుంది. సీతారామ ప్రాజెక్టుకు అనుసంధానమైన దోమల వాగు ద్వారా సాగునీటిని. పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు విడుదల చేశారు.
ఈ నీటి విడుదలతో లక్ష్మీపురం, సంజీవరెడ్డి పాలెం, బూర్గంపాడు, మొరంపల్లి బంజర, నకిరేపేట, వేపలగడ్డ తదితర గ్రామాల పరిధిలోని దాదాపు 800 ఎకరాల వ్యవసాయ భూములకు సాగునీరు అందనుంది. చాలా రోజులుగా నీటి కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఇది పెద్ద ఊరటగా మారింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, సీతారామ ప్రాజెక్టు ద్వారా ప్రాంతంలోని రైతులకు మరింత స్థిరమైన సాగునీరు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. వ్యవసాయం అభివృద్ధి చెందితేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని పేర్కొన్నారు.
సాగునీరు విడుదల కావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తూ పంటలు బాగా పండే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.

إرسال تعليق