మణుగూరు: ఈనెల 19న మెగా జాబ్ మేళా సద్వినియోగం చేసుకోండి

 


మణుగూరు, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


మణుగూరులో ఈ నెల 19న సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించబడనుంది. ఈ జాబ్ మేళాకు 100కుపైగా కంపెనీలు పాల్గొంటున్నాయి, దాదాపు 4,000 నుండి 4,500 ఉద్యోగాల అవకాశాలు ఉన్నాయి. అర్హతలు పదవ తరగతి నుండి పీజీ (పోస్ట్ గ్రాడ్యుయేట్) వరకు  ఉన్నాయి. ఈ కార్యక్రమం భద్రాద్రి స్టేడియం, పివి కాలనీ, మణుగూరు వద్ద ఉదయం 8:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది.ఈ కార్యక్రమానికి ముఖ్యాతిథిగా తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క హాజరవుతారు. ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఈ కార్యక్రమానికి  సారథ్యం వహిస్తున్నారు. ఇక్కడ హైదరాబాద్ వెళ్లకుండానే మణుగూరులోనే ఉద్యోగ ఇంటర్వ్యూలు నేరుగా నిర్వహించనున్నారు. ఆసక్తి ఉన్నవారు హెల్ప్ లైన్ నెంబర్ 9640 208140 ద్వారా మరిన్ని వివరాలు పొందవచ్చు.ఉద్యోగార్హతలు ఏ స్థాయికి ఉన్నా నిరుద్యోగులు ఈ అవకాశాన్ని వినియోగించి తమకు సరైన ఉద్యోగం పొందే అవకాశం ఉందని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అభిప్రాయపడ్డారు.

Post a Comment

أحدث أقدم