ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:హైదరాబాద్ ప్రజాభావన్ లో ఆదివాసీ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర నాయకులు చందా లింగయ్య ఆధ్వర్యంలో భద్రాద్రి జిల్లా,ములుగు జిల్లా గిరిజన ఇసుక సొసైటీల అధ్యక్షులు ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ని కలిసి నూతన ఇసుక పాలసీ ద్వారా ఏజెన్సీ ప్రాంతంలోని ఆదివాసీలకు నష్టం జరుగుతుందని గిరిజన సొసైటీల ద్వారానే ప్రభుత్వం ఇసుక రిచ్ లు నిర్వహించాలని విన్నవిస్తూ వినతిపత్రాన్ని అందజేశారు. ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న చట్టాలు హక్కులకు గిరిజన ఇసుక సొసైటీలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని తదనుగుణంగానే నూతన ఇసుక పాలసి ఉంటుందని ఒక క్యూబిక్ మీటర్ మీద ప్రస్తుతం ఉన్న ధరలకు తగ్గట్టుగానే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటున్నదాని అన్నారు. ఈకార్యక్రమంలో ఆదివాసీ లిబరేషన్ ఫోర్స్(ALF)రాష్ట్ర అధ్యక్షుడు దబ్బకట్ల.సుమన్, ఆదివాసీహక్కులపరిరక్షణ వేదిక తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ ఇరప. రాజు,ఆదివాసీ మహిళ సంఘం నాయకులు వట్టం.సుభద్ర
గిరిజన అభ్యుదయ సంఘం ములుగు జిల్లా అధ్యక్షులు ముద్దబోయిన.రవి,ఆదివాసీ సంక్షేమ పరిషత్ ములుగు జిల్లా అధ్యక్షుడు టింగా.బుచ్చయ్య,మన్యసీమ జిల్లా అధ్యక్షులు ఈసం. రాజు,భద్రాద్రి జిల్లా అధ్యక్షులు గోగ్గాలి.రామకృష్ణ, ఇసుక సొసైటీల అధ్యక్షులు పుసం.కార్తిక్.ప్రశాంత్.మడి. శోభన్ మొదలగు వారు పాల్గొన్నారు.
إرسال تعليق