ఎస్సై రాజ్ కుమార్ సేవలు మరువలేనివి..పలు సేవా కార్యక్రమాల్లో ముందంజ....

  



   పినపాక, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:

- అసాంఘిక శక్తులను కట్టడి చేయడంలో మేటి.  

- గుత్తకోయ గ్రామాల అభివృద్ధిలో పోలీస్ పాత్ర మరువలేనిది.


- క్రికెట్ అంటే మక్కువ.... పేకాట అంటే పరిగెత్తిస్తాడు ....                       

- అక్రమార్కుల పట్ల సింహ స్వప్నం


 -పలు సేవా కార్యక్రమాల్లో ముందంజలో ఉన్నందుకు ఉన్నతాధికారులతో ప్రశంసలు పొందుతున్న ఈ బయ్యారం పోలీస్.




- పోలీస్ అంటే వామ్మో, భయం అనే ధోరణికి సమర గీతం పలికి ఫ్రెండ్లీ పోలీస్, పోలీస్ అంటే అభయం, ఉన్నత శాఖ అధికారుల ఆదేశాలు సూచనల మేరకు ప్రజల నుండి ఎటువంటి ఫిర్యాదులు అందిన తక్షణమే స్పందిస్తూ శభాష్ పోలీస్ అనే విధంగా ఈ బయ్యారం పోలీసు ముందుకు సాగుతున్నారు.



 అదేవిధంగా అనేక గ్రామాల్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాలు, గుత్తి కోయ గ్రామాల్లో ప్రజానీకానికి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు, గంజాయి మహమ్మారిని కోడిపందాలు, పేకాటను నివారించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటూ అనేక మందిపై కేసులు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. గత కొంతకాలంగా పరిష్కారం గాని సమస్యలకు పరిష్కారం చూపారు. స్టేషన్ వచ్చే ఫిర్యాదు దారుల పట్ల సున్నితంగా వ్యవహరిస్తూ ప్రతి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్న ఈ బయ్యారం ఖాకీలు ప్రజల మన్నలు పొందుతున్నారు.

- క్రికెట్ అంటే ఆటగాడిలా.... పేకాట అంటే చేజ్ మాస్టర్ల పరిగెత్తించాల్సిందే...

 ఈ బయ్యారం ఎస్సై రాజ్ కుమార్ రూటే సపరేటు మండలంలో క్రికెట్ క్రీడాలు ఇక్కడ నిర్వహించిన అతిథిగా వెళ్లి యువకులతో కలిసి ఆటగాడిలా మారిపోతాడు. యువత చెడు మార్గాన్ని వదిలి మంచి మార్గంలో నడవాలని అందరికీ ఆదర్శంగా నిలవాలని అనేక సూచనలు చేస్తుంటారు. అసంఘిక కార్యక్రమాలకు పాల్పడేటటువంటి యువకులు గ్రామాల్లో ఎటువంటి అల్లరులు సృష్టించిన సహించేది లేదంటూ అనేకమంది గంజాయి బాధితులకు విముక్తి కలిగించి , గంజాయి సరఫరా చేసే నిందితులను కటకటాలు పాలు చేసిన ఘనత బయ్యారం పోలీసులదే . ఇక కోడిపందాలు, పేకాట, చిత్తు బొత్తు ఆడుతున్నారంటే సమాచారం అందిన వెంటనే ఎంత దూరమైనా వెళ్లి చేదించి జూదపరులను వెంటాడి కటకటాలకు పంపించిన రాజ్ కుమార్ జూదపరుల వెన్నులో వణుకు పుట్టించే చేజ్ మాస్టర్ల మారారు.అసాంఘిక కార్యక్రమాలను పూర్తిస్థాయిలో నివారణ చేస్తూ ఇటువంటి పోలీస్ సమాజానికి అవసరం అనే విధంగా ముందుకు సాగుతున్నారు.


-పలు గ్రామాల అభివృద్ధిలో పోలీసు సేవలు బేస్... మండల పరిధిలోని పలు గ్రామాల్లో పోలీసులు చేసిన సేవా కార్యక్రమాలు ఎన్నటికీ మరువలేనివని పలువురు కొనియాడుతున్నారు. అదేవిధంగా వలస గుత్తి కోయ గ్రామాల్లో గత కొంతకాలంగా ఉన్నత శాఖ అధికారుల ఆదేశాల మేరకు ఈ బయ్యారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆ గ్రామాల అభివృద్ధి కోసం పోలీసులు, పలు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో గ్రామాల్లోని రోడ్డు మరమ్మత్తులు, సోలార్ ప్లాంట్ సౌకర్యం, మంచినీటి సమస్య, గ్రామాల్లోని పలు కుటుంబాలకు నిత్యవసర సరుకులు, అందజేయడంతో పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.


ఫ్లాష్ ఫ్లాష్ ఫ్లాష్ అక్రమ ఇసుక రవాణా చేస్తున్న  ట్రాక్టర్లు పట్టివేత


 ఫ్లాష్ ఫ్లాష్ ఫ్లాష్ .....ఇన్ఫార్మర్ నెపం తో వ్యక్తి దారుణ హత్య


Post a Comment

కొత్తది పాతది