EB NEWS/కరకగూడెం
ప్రపంచ హృదయ దినోత్సవం (వరల్డ్ హార్ట్ డే) సందర్భంగా మండల వైద్యాధికారి రవి తేజ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా వైద్యాధికారి రవి తేజ మాట్లాడుతూ.. ప్రస్తుత జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి కారణంగా గుండె జబ్బులు పెరుగుతున్నాయని అన్నారు. ప్రతి ఒక్కరూ రోజూ వ్యాయామం చేయడం, ఉప్పు, నూనె తక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం, పొగతాగడం, మద్యం మానేయడం అలవాటు చేసుకోవాలని సూచించారు.
30 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ ఏడాదికి ఒకసారి బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాలని, ఛాతీ నొప్పి, ఆయాసం వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని కోరారు.

