ఐలాపురం వద్ద వంతెనపై గుంతలు.. ఇనుప సువ్వలు బయటకు

G Rajashekar
By -
0

 


మణుగూరు–ఏటూరునాగారం ప్రధాన రహదారిపై ప్రమాదకర పరిస్థితి.. వెంటనే మరమ్మతులు చేపట్టాలని ప్రయాణికుల విజ్ఞప్తి


EB NEWS/పినపాక: 


పినపాక మండలం, ఐలాపురం గ్రామ సమీపంలోని వంతెనపై రహదారి దెబ్బతిని గుంతలు ఏర్పడ్డాయి. రోడ్డుపై ఇనుప సువ్వలు బయటకు రావడంతో వంతెనపై ప్రయాణం ప్రమాదకరంగా మారిందని వాహనదారులు, ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


వంతెనపై రహదారి పలుచోట్ల దెబ్బతినడంతో వాహనాలు అదుపుతప్పే పరిస్థితి ఏర్పడుతోందని, ఇప్పటికే పలుమార్లు ప్రమాదాలు చోటుచేసుకున్నాయని స్థానికులు చెబుతున్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు గుంతలు, బయటకు వచ్చిన ఇనుప సువ్వల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొంటున్నారు.


మణుగూరు–ఏటూరునాగారం ప్రధాన రహదారి కావడంతో ఈ మార్గంలో నిత్యం పెద్ద సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. హెవీ వాహనాల రాకపోకలు కూడా అధికంగా ఉండటంతో వంతెనపై దెబ్బతిన్న ప్రాంతం మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


వంతెన పూర్తిగా దెబ్బతిని పరిస్థితి మరింత తీవ్రంగా మారకముందే సంబంధిత అధికారులు స్పందించి గుంతలను పూడ్చడంతో పాటు బయటకు వచ్చిన ఇనుప సువ్వలను తొలగించి, వంతెనకు అవసరమైన మరమ్మతులు చేపట్టాలని ప్రయాణికులు, వాహనదారులు, స్థానికులు కోరుతున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)