భద్రాచలం వద్ద వేగంగా పెరుగుతున్న గోదావరి.. మొదటి ప్రమాద హెచ్చరికకు చేరువలో

G Rajashekar
By -
0

 


40 అడుగుల వద్ద 7,91,034 క్యూసెక్కుల ప్రవాహం.. సాయంత్రానికి మొదటి ప్రమాద హెచ్చరికకు చేరే అవకాశం


EB NEWS/భద్రాచలం: 


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం వేగంగా పెరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం భద్రాచలం వద్ద 40 అడుగుల స్థాయిలో 7,91,034 క్యూసెక్కుల నీటి ప్రవాహంతో గోదావరి దిగువకు ప్రవహిస్తోంది.

నీటి ప్రవాహం ఇదే స్థాయిలో కొనసాగితే ఆదివారం సాయంత్రానికి గోదావరి మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో గోదావరి పరివాహక ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.


నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో పరిస్థితిని అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ప్రజలు నది పరివాహక ప్రాంతాలకు వెళ్లకుండా, అధికారుల సూచనలు పాటించాలని కోరుతున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)