మణుగూరులో కార్పెంటర్ వద్ద 12 టేకు దిమ్మెలు పట్టివేత

G Rajashekar
By -
0

 


EB NEWS/మణుగూరు:


 సుందరయ్యనగర్‌లో ఓ కార్పెంటర్ వద్ద అక్రమంగా నిల్వ ఉంచినట్లు గుర్తించిన 12 టేకు దిమ్మెలను అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.


రేంజర్ ఉపేందర్ ఆదేశాల మేరకు అటవీ శాఖ సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సుందరయ్యనగర్‌లోని ఓ కార్పెంటర్ వద్ద నిల్వ ఉంచిన 12 టేకు దిమ్మెలను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.


ఈ తనిఖీల్లో అటవీ శాఖ సిబ్బంది అజ్మీర్ శాంతి, రమేష్, ప్రమీల, రాణి పాల్గొన్నారు. స్వాధీనం చేసుకున్న టేకు దిమ్మెలకు సంబంధించి అటవీ శాఖ నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు సమాచారం.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)