కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న మహిళ.. దాతలు ఆదుకోవాలని వేడుకోలు

G Rajashekar
By -
0

 



నిరుపేద కుటుంబం.. చికిత్సకు ఆర్థిక ఇబ్బందులు.. హైదరాబాద్‌కు వెళ్లేందుకు కూడా డబ్బులు లేని పరిస్థితి


EB NEWS/పినపాక:


 కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న నిరుపేద మహిళ చికిత్స కోసం దాతల సాయం కోరుతోంది. పినపాక మండలం ఏడూళ్ల బయ్యారం గ్రామానికి చెందిన పాపాల రాజ్యలక్ష్మి (55) కొంతకాలంగా కిడ్నీ సంబంధిత అనారోగ్యంతో బాధపడుతోంది.


రాజ్యలక్ష్మి భర్త కనకయ్యతో కలిసి నిరుపేద కుటుంబంగా జీవిస్తున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెను కుటుంబ సభ్యులు ఖమ్మంలోని ఆస్పత్రికి తీసుకెళ్లగా, మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు వెళ్లాలని వైద్యులు సూచించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వారి ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉండటంతో హైదరాబాద్‌కు వెళ్లేందుకు అవసరమైన ప్రయాణ ఖర్చులు కూడా సమకూర్చుకోలేని పరిస్థితి ఉందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చికిత్స కోసం ఆర్థిక సహాయం అందించేందుకు దాతలు ముందుకు రావాలని రాజ్యలక్ష్మి కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.


తమకు అందించే చిన్నపాటి సహాయం కూడా చికిత్సకు ఎంతో ఉపయోగపడుతుందని, మానవతా దృక్పథంతో ఆదుకోవాలని చేతులెత్తి వేడుకుంటున్నారు.


 సహాయం అందించవలసిన phonepe నెంబరు:9949 873 577

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)