గుండాల, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
గుండాల పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన మండల స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ఇల్లందు డిఎస్పి చంద్రభాను
జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు గత మూడు రోజులుగా గుండాలలో పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మండల స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ ఈ రోజుతో ముగిసింది.ఈ ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఇల్లందు డిఎస్పి ఎన్.చంద్రబాను హాజరయ్యారు.ఈ వాలీబాల్ టోర్నమెంట్లో గుండాల,ఆళ్లపల్లి,కొమరారం పోలీస్ స్టేషన్ల పరిధిలోని మొత్తం 40 జట్లు పాల్గొన్నాయి.
ఈ 40 జట్లలో ఫైనల్ కు దామరతోగు మరియు చిన్న వెంకటాపురం జట్లు చేరుకున్నాయి. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ ఫైనల్ మ్యాచ్ నందు రెండు జట్లు హోరాహోరీగా పోరాడినాయి.రెండు జట్లలో దామతోగు జట్టు విజేతగా నిలిచింది.
మొదటి స్థానంలో నిలిచిన దామరతోగుకు జట్టుకు బహుమతిగా 15000/- రూపాయలు మరియు షీల్డ్ అందజేయడం జరిగింది.
చిన్న వెంకటాపురం జట్టుకు ద్వితీయ బహుమతిగా 10,000/-ల రూపాయలు మరియు షీల్డ్ అందజేయడం జరిగింది.మామకన్ను జట్టుకు తృతీయ బహుమతిగా 6000/-ల రూపాయలు మరియు షీల్డ్ ను అందజేయడం జరిగినది.
ఈ సందర్బంగా ఇల్లందు డిఎస్పి చంద్రబాను గారు మాట్లాడుతూ ఏజెన్సీ యువత చెడు మార్గాల జోలికి పోకుండా చదువు,క్రీడలపై దృష్టి పెట్టాలి అని తెలిపారు.అసాంఘిక శక్తులకు సహకరించవద్దని కోరారు.
ఏజెన్సీ ప్రాంతాలు అభివృద్ధి చెందాలని పోలీసు వారు తమ వంతు భాద్యతగా క్రీడా పోటీలు,మెడికల్ క్యాంపులు,రోడ్డులు,కమ్యూనిటీ హాళ్లు,క్రీడాస్థలాల ఏర్పాటు నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఈ క్రీడా పోటీలను ఘనంగా నిర్వహించిన గుండాల సీఐ రవీందర్,యస్ఐ రవూఫ్ మరియు గుండాల సిబ్బందిని అభినందించారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి