EB NEWS/తెలంగాణ:
సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు జరగాల్సిన బ్యాంకు ఉద్యోగుల సమ్మె వాయిదా పడింది. యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) సమ్మెను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.
ఆదివారం UFBU–ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA) మధ్య జరిగిన సమావేశంలో పలు అంశాలపై చర్చలు జరిగాయి. చర్చలు సానుకూలంగా సాగడంతో సమ్మెను ప్రస్తుతానికి వాయిదా వేయాలని బ్యాంకు ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి.
ప్రధానంగా శనివారాల్లో బ్యాంకులకు సెలవు కల్పించాలన్న డిమాండ్‌పై ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయించినట్లు యూనియన్లు తెలిపాయి. కమిటీ నిర్ణయం అనంతరం తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని బ్యాంకు ఉద్యోగ సంఘాలు వెల్లడించాయి.
దీంతో సెప్టెంబర్ 28–30 తేదీల్లో బ్యాంకింగ్ సేవలకు ప్రతిపాదిత సమ్మె కారణంగా ఏర్పడే అంతరాయం ప్రస్తుతానికి ఉండదని భావిస్తున్నారు.

