పినపాక నూతన తహసీల్దార్‌గా అప్క రమేష్ బాధ్యతలు

G Rajashekar
By -
0




డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేస్తూ పదోన్నతి.. అదే మండలంలో తహసీల్దార్‌గా బాధ్యతలు


EB NEWS/పినపాక:


 పినపాక మండల నూతన తహసీల్దార్‌గా అప్క రమేష్ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు పినపాక మండలంలోనే డిప్యూటీ తహసీల్దార్‌గా విధులు నిర్వహించిన ఆయనకు పదోన్నతి లభించడంతో అదే మండలానికి తహసీల్దార్‌గా బాధ్యతలు చేపట్టారు.


డిప్యూటీ తహసీల్దార్‌గా పినపాక మండలంలో విధులు నిర్వహించిన అనుభవం ఉండటంతో, మండలంలోని రెవెన్యూ వ్యవహారాలు, ప్రజల సమస్యలపై ఆయనకు ఇప్పటికే అవగాహన ఉంది. దీంతో తహసీల్దార్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం రెవెన్యూ సేవలను మరింత సమర్థవంతంగా అందించడంతో పాటు, ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేయాలని స్థానికులు ఆకాంక్షిస్తున్నారు.


రమేష్ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, రెవెన్యూ సిబ్బంది, స్థానికులు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)