యువతకు అదిరిపోయే అవకాశం.. ఎస్సై, కానిస్టేబుల్ పరీక్షలకు ఉచిత కోచింగ్!

G Rajashekar
By -
0


EB NEWS/ఉమ్మడి ఖమ్మం:


పోలీస్‌ శాఖలో ఉద్యోగం సాధించాలనుకునే గిరిజన యువతకు ఐటీడీఏ శుభవార్త అందించింది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు చెందిన గిరిజన అభ్యర్థులకు ఎస్సై, కానిస్టేబుల్‌ ఉద్యోగ పరీక్షల కోసం 100 మందికి ఉచిత శిక్షణ అందించనున్నట్లు ఐటీడీఏ పీవో బి.రాహుల్‌ తెలిపారు.


అభ్యర్థుల కుటుంబ వార్షిక ఆదాయం రూ.3 లక్షల్లోపు ఉండాలని పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్‌ 7లోగా దరఖాస్తు చేసుకోవాలి. అక్టోబర్‌ 10న అర్హత పరీక్ష నిర్వహించనున్నట్లు, ఎంపికైన వారికి అక్టోబర్‌ 15 నుంచి శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయని తెలిపారు.


పోలీస్‌ ఉద్యోగాన్ని లక్ష్యంగా పెట్టుకున్న గిరిజన యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పీవో రాహుల్‌ సూచించారు. మరిన్ని వివరాలకు 8978477345 నంబర్‌ను సంప్రదించాలి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)