పదో తరగతి విద్యార్థులకు బిగ్ అలర్ట్‌!

G Rajashekar
By -
0

 



 హాల్‌టికెట్లు, మెమోల్లో తప్పులు రాకుండా ఇప్పుడే వివరాలు సరిచేసుకోండి!


TG/EB NEWS:

తెలంగాణ లో మార్చి 2027లో జరగనున్న పదో తరగతి పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థులకు ప్రభుత్వ పరీక్షల విభాగం కీలక సూచన చేసింది. విద్యార్థులు తమ వ్యక్తిగత వివరాలను ఇప్పుడే పరిశీలించుకుని, తప్పులుంటే సరిచేసుకోవాలని పరీక్షల విభాగం సంచాలకులు కోరారు.


ప్రస్తుతం యూడైస్‌ ప్లస్‌ (UDISE+) పోర్టల్‌లో నమోదైన వివరాల ఆధారంగానే పదో తరగతి హాల్‌టికెట్లు, మెమోలను ముద్రించనున్నారు. విద్యార్థుల పేర్లు, తల్లిదండ్రుల పేర్లు, పుట్టిన తేదీల్లో ఏవైనా తప్పులు ఉంటే వెంటనే పాఠశాల ప్రధానోపాధ్యాయుల (హెచ్‌ఎం) దృష్టికి తీసుకెళ్లి సరిచేసుకోవాలి.


చివరి నిమిషంలో ఇబ్బందులు తలెత్తకుండా విద్యార్థులు, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

إرسال تعليق

0 تعليقات

إرسال تعليق (0)