EB NEWS/ భారత్ :
నిరుద్యోగులకు శుభవార్త. ఇంటెలిజెంట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇండియా లిమిటెడ్ (ICSIL) డేటా ఎంట్రీ ఆపరేటర్ (DEO), మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ నియామక ప్రక్రియలో భాగంగా మొత్తం 40 ఖాళీలను భర్తీ చేయనున్నారు. డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు ఇంటర్ పూర్తి చేసిన వారు అర్హులు.
ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ icsil.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులకు చివరి తేదీ ఏప్రిల్ 11గా నిర్ణయించారు.
అర్హతలు, వయోపరిమితి, ఎంపిక విధానం వంటి పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని అధికారులు సూచించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి