EB NEWS/హైదరాబాద్:
హైదరాబాద్‌లో రాష్ట్ర డీజీపీ శివధర్రెడ్డి ఎదుట 30 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో పీఎల్జీఏ (PLGA) బెటాలియన్‌కు చెందిన సభ్యులు, డిప్యూటీ కమాండర్ కేశాలు కూడా ఉన్నారు.
ఈ సందర్భంగా వారు సుమారు 40 ఆయుధాలను పోలీసులకు అప్పగించారు. ప్రభుత్వ పునరావాస విధానాల పట్ల ఆకర్షితులై, ప్రధాన జీవన ప్రవాహంలోకి చేరేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ లొంగుబాటు మావోయిస్టు కార్యకలాపాలపై గణనీయ ప్రభావం చూపే కీలక పరిణామంగా భావిస్తున్నారు. ఇకపై మరిన్ని మంది మావోయిస్టులు కూడా లొంగిపోవడానికి ఇది ప్రేరణ కలిగించే అవకాశముందని పోలీసు ఉన్నతాధికారులు పేర్కొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి