పినపాకలో అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమాలు.

G Rajashekar
By -
0

 

BHADRADRI KOTHAGUDEM NEWS, TELANGANA NEWS,




EB NEWS/పినపాక:


రానున్న ఏప్రిల్ ,మే నెలల్లో అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఉంటాయని వీటి నివారణకై మండలంలోని ప్రజలందరూ తగు జాగ్రత్తలు తీసుకొని ప్రతి ఒక్కరు అప్రమత్తతతో వ్యవహరించాలని పినపాక మండల కేంద్రంలోని అగ్నిమాపక శాఖ కార్యాలయ సిబ్బంది ఈ సందర్భంగా మాట్లాడుతూ 1944 ఏప్రిల్ 14న ఒక నౌకలో జరిగిన అగ్ని ప్రమాదంలో విధి నిర్వహణలో ఉన్న 66 మంది అగ్నిమాపక దళ సిబ్బంది అసువులు బాసిన కారణంగా వారి జ్ఞాపకార్థం అగ్నిమాపక వారోత్సవాలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి సంవత్సరం వేసవి కాలంలో అధికంగా అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది... కావున ప్రజల్లో అవగాహన పెంచడానికి ప్రభుత్వం తరఫున ప్రభుత్వ పాఠశాలల్లో, కళాశాలలో అవగాహన కార్యక్రమాలను ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుందని ఈ వారోత్సవాల ద్వారా ప్రజల్లో అగ్ని ప్రమాదాలపై చైతన్యం పెంచడం ప్రమాదాల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడం అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలో తెలియజేయడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని తెలిపారు . చిన్న జాగ్రత్తలతో పెద్ద అగ్ని ప్రమాదాల నుంచి కాపాడుకోవచ్చని, గ్రామాల్లోని ప్రజలు తమ గృహాల్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరగకుండా, గ్యాస్ లీకేజీని అరికట్టటం వంటి తగు జాగ్రత్తలతో వ్యవహరించడం ద్వారా ప్రమాదాలు జరగకుండా నివారించే అవకాశం ఉందని అన్నారు. అగ్ని ప్రమాదం సంభవించిన వెంటనే 101 కి చరవాణి ద్వారా సమాచారం అందిస్తే వెంటనే అగ్నిమాపక శాఖ సిబ్బంది స్పందించి ప్రమాద తీవ్రతను తగ్గించి, ఆస్తి నష్టం ,ప్రాణస్టం జరగకుండా కాపాడే వీలు ఉంటుందని తెలిపారు. ఈ అవగాహన కార్యక్రమంలో అగ్నిమాపక కార్యాలయ సిబ్బంది వెంకటాద్రి, చందు, రామానాయుడు, ఉదయ్ తేజ పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)