పినపాక, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
బీసీసీఐ నిర్వహించే జాతీయస్థాయి అండర్-23 మహిళల వన్డే క్రికెట్ టోర్నీకి పినపాకకు చెందిన వైష్ణవి రత్న ఎంపికయ్యారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆదివారం జట్టును ప్రకటించింది. పినపాక జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న వైష్ణవి, తన ప్రతిభతో రాష్ట్ర జట్టులో చోటు సంపాదించడంతో పినపాక ప్రాంతంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. ఈ సందర్భంగా పలువురు క్రీడా ప్రముఖులు, అధ్యాపకులు ఆమెను అభినందించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి