ఇందిరమ్మ ఇళ్లలో ఆలస్యం.. అధికారులపై ఎమ్మెల్యే పాయం ఆగ్రహం

G Rajashekar
By -
0

 


EB NEWS/బూర్గంపహాడ్:


 పినపాక నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తి కాకపోవడంపై ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం పేదలకు ఇల్లు నిర్మించుకునేందుకు రూ.5 లక్షలు మంజూరు చేస్తుంటే పనులు ఎందుకు పూర్తిచేయడం లేదని ప్రశ్నించారు.పేదలకు ప్రభుత్వం అందిస్తున్న పథకాలు సమయానికి చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.


ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తిస్థాయిలో పూర్తి చేయాలని, ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో మరింత మంది లబ్ధిదారులకు ఇళ్లు మంజూరు చేయనున్నామని తెలిపారు. అధికారులు బాధ్యతగా పనిచేయాలని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)