కామ్రేడ్ అయోధ్య మెమోరియల్ షటిల్ టోర్నమెంట్ విజయోత్సవం.

 


మణుగూరు, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


స్వర్గీయ కామ్రేడ్ అయోధ్య స్మరణార్థంగా రామానుజవరం గ్రామ పంచాయతీలో నిర్వహించిన అయోధ్య మెమోరియల్ షటిల్ టోర్నమెంట్–2026 ఘనంగా ముగిసింది. 

గ్రామ సర్పంచ్ కలం కల్పన ఆధ్వర్యంలో జరిగిన ఈ క్రీడా వేడుక ఉత్సాహభరితంగా సాగింది.

సీనియర్ విభాగం డబుల్స్ లో గణపారపు దేవదాస్ – మధు మొదటి బహుమతి ₹5,000 గెలుచుకోగా, కర్నె కోటేష్ – నిమ్మనగంటి శివాజీ జంటకు రెండవ బహుమతి ₹3,000 లభించింది. 

జూనియర్ విభాగంలో దేశబోయిన అరవింద్ – సాదిని సాయి ₹1,000, మేకపోతుల నిఖిల్, నడికొప్పుల నమృత్‌కు ₹500 చొప్పున బహుమతులు అందించారు.


ఈ టోర్నమెంట్ ద్వారా యువతలో క్రీడా స్పూర్తి పెరిగిందని, కామ్రేడ్ అయోధ్య సేవలను స్మరిస్తూ భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు.

Post a Comment

కొత్తది పాతది