EB NEWS/మణుగూరు:
మణుగూరు ప్రాంతంలోని గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క కూడా పాల్గొన్నారు.
గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ధిపై సీఎం సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఆదివాసీలకు ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపును పెంచాలని, నియోజకవర్గంలో భూ హక్కుల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు.
అలాగే, గిరిజన గ్రామాల్లో మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం కొత్త రోడ్లు నిర్మాణం, చెక్ డ్యాంల ఏర్పాటు వంటి పనులను చేపట్టాలని అధికారులకు సూచించినట్లు ఎమ్మెల్యే వివరించారు. ఈ నిర్ణయాలతో గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి మరింత వేగం అందుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

