2 వేల ఇందిరమ్మ ఇండ్ల మంజూరు.. అధికారులకు కలెక్టర్ ఆదేశాలు

G Rajashekar
By -
0

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, 


 రాష్ట్ర ప్రభుత్వం రెండో విడతలో భాగంగా ప్రతి నియోజకవర్గానికి 2,000 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసినట్లు జిల్లా కలెక్టర్ అంకిత్ తెలిపారు. ఇందుకు సంబంధించి అర్హులైన లబ్ధిదారులను గుర్తించే ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.


గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో ఉన్న పూరి గుడిసెలు, నివాసయోగ్యం కాని ఇళ్లు మరియు గృహరహిత కుటుంబాల వివరాలను సేకరిస్తూ నిర్వహిస్తున్న సర్వేలను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. లబ్ధిదారుల ఎంపికలో పూర్తిస్థాయి పారదర్శకత, నిష్పాక్షికత పాటించాలని అధికారులకు స్పష్టం చేశారు.


అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అంకిత్ పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా నిరుపేదలకు శాశ్వత గృహ వసతి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)