పినపాక, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
-మృతురాలి దహన సంస్కారాలకు 13300 ఆర్థిక సహాయం....
- పినపాక మండల కార్యాలయంలో గతంలో మజ్కూర్ పనిచేసిన మృతురాలు పిట్టల లక్ష్మి....
పినపాక: మండలంలోని గోపాలరావుపేట గ్రామానికి చెందిన పిట్టల లక్ష్మి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటలకు మృతి చెందారు. గతంలో పినపాక మండల కార్యాలయంలో మజ్కూర్ గా పని చేసిన పిట్టల లక్ష్మి తోగ్గూడెం పంచాయతీలో తన సేవలు అందించింది. విధి వక్రీకరించడంతో కుటుంబ పెద్దలు మొత్తం ఒక్కొక్కరిగా సంవత్సర కాలంలో మరణించారు. అనాధగా మిగిలిన తాను ఆ బాధను జీర్ణించుకోలేక కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ నేడు తుది శ్వాస విడిచారు.
ఎవరూ లేని పిట్టల లక్ష్మి దహనసంస్కారాలకు సహాయాలు అందించాలంటూ గ్రామానికి సంబంధించిన సామాజిక మాధ్యమంలో విషయాన్ని తెలపగా...మేమున్నాం అంటూ మానవత్వం తో ముందుకు వచ్చిన యువత, గ్రామపెద్దలు కలిసి 13,300 రూపాయలను దహన సంస్కారాలకు ఊడుగుల ఐలయ్య చేతులమీదుగా వారి కుటుంబ సభ్యులకు అందించారు.
ఈ కార్యక్రమంలో కూనారపు సత్యనారాయణ, సూర నరసింహారావు, ఊడుగుల రామచంద్రు, డాక్టర్ సత్యం, కొంపెల్లి సంతోష్, గాడుదుల దిలీప్ కుమార్, రేసు కోటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి