పినపాక, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా SP ప్రత్యేకంగా రూపొందించిన "చైతన్యం " అనే కార్యక్రమం లో భాగంగా ఈరోజు ఏడుళ్ల బయ్యారం PS పరిధి లో పాన్ షాపులలో ఎస్ఐ సురేష్ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గంజాయి లేదా డ్రగ్స్ విక్రయాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
యువత వాటికి దూరంగా ఉండాలని సూచించారు. గంజాయి వంటి మాదకద్రవ్యాలు ఎంతోమంది జీవితాలను నాశనం చేశాయని తెలిపారు. ఎవరైనా డ్రగ్స్ లేదా గంజాయి అమ్మకాలు జరిపితే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి