సీతారాముల కళ్యాణం మహిమ: భద్రాచలం ఉత్సవాల విశేషాలు తెలుసా?



EB NEWS/భద్రాచలం:


భద్రాచలం శ్రీ సీతారాముల కళ్యాణం (శ్రీరామ నవమి ఉత్సవాలు) చరిత్ర చాలా పురాతనమైనది.ఈ ఉత్సవాలు 17వ శతాబ్దంలో (సుమారు 1674 ప్రాంతంలో) ప్రారంభమైనట్లు చరిత్ర చెబుతోంది.


భక్తుడు భద్రాచల రామదాసు (కంచర్ల గోపన్న) కాలంలో ఈ వేడుకలు విశేషంగా ప్రారంభమయ్యాయి.350 ఏండ్ల నుంచి ఇప్పటివరకు ఈ ఉత్సవాలు నిరంతరంగా కొనసాగుతున్నాయి.


(శ్రీరామ నవమి ఉత్సవాలు) దేశవ్యాప్తంగా అత్యంత ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మిక వేడుకల్లో ఒకటి. ఇక్కడ జరిగే ఉత్సవాలకు ప్రత్యేకమైన మహిమ, సంప్రదాయం ఉంది.

 ఇక్కడ జరిగే ఉత్సవాలకు ప్రత్యేకమైన మహిమ, సంప్రదాయం ఉంది.సాధారణ తలంబ్రాల బదులు ముత్యాలతో చేసిన తలంబ్రాలు సమర్పించడం ప్రత్యేకం.గోదావరి నది తీరంలో జరిగే ఈ వేడుకలకు ఆధ్యాత్మికమైన ప్రత్యేక శోభ ఉంటుంది.పండితులు వేద మంత్రాలు చదువుతూ సంప్రదాయ హిందూ వివాహ విధానంలో పూజలు నిర్వహిస్తారు.


స్వామివారు సీతాదేవికి మంగళసూత్రం కట్టినట్లుగా ఆచారం నిర్వహిస్తారు.సీతారాములపై ముత్యాల తలంబ్రాలు పోస్తారు – ఇది ముఖ్యమైన ఘట్టం.ఈ కళ్యాణం తిలకించిన వారికి అశ్వమేధ యాగ ఫలం లభిస్తుందని భక్తుల నమ్మకం.దేశం నలుమూలల నుంచి భక్తులు వచ్చి ప్రత్యక్షంగా కళ్యాణం తిలకిస్తారు. టీవీ, ఆన్‌లైన్ ద్వారా కోట్లాది మంది వీక్షిస్తారు.

Post a Comment

أحدث أقدم