ఖమ్మంలో మెగా జాబ్ మేళా రేపే.. యువతకు భారీ అవకాశాలు

G Rajashekar
By -
0

 


EB NEWS:ఖమ్మం:


ఖమ్మం నగరంలోని సహకారనగర్‌లో ఉన్న ఎస్‌ఆర్ & బీజీఎన్‌ఆర్ డిగ్రీ కళాశాలలో మంగళవారం మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని కళాశాల కేరీర్ గైడెన్స్ ప్లేస్‌మెంట్ సెల్, టీఈఎస్‌కే (TESKC) సంయుక్త ఆధ్వర్యంలో, మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ సహకారంతో నిర్వహిస్తున్నారు.


కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మొహమ్మద్ జాకిరుల్లా తెలిపారు , 2019 నుండి 2025 మధ్యకాలంలో డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు మరియు ప్రస్తుతం డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఈ జాబ్ మేళా ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు చెప్పారు.


అభ్యర్థులు తమ విద్యార్హతలకు సంబంధించిన అన్ని మెమోలు, ఆధార్ కార్డు, ఒక సెట్ జిరాక్స్‌లు, ఒక పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోతో పాటు ఎనిమిది రెజ్యూమ్ సెట్లు తీసుకురావాలని సూచించారు. మరిన్ని వివరాలకు 9441939579, 9618896949 నంబర్లను సంప్రదించవచ్చని తెలిపారు.

إرسال تعليق

0 تعليقات

إرسال تعليق (0)