EB NEWS/భద్రాద్రి కొత్తగూడెం:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న భారతీ ట్రావెల్స్ బస్సులో డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఘటన ప్రయాణికులను భయాందోళనకు గురిచేసింది. బస్సు నడుపుతూనే మొబైల్‌లో క్రికెట్ మ్యాచ్ చూస్తూ డ్రైవింగ్ చేశాడని ప్రయాణికులు ఆరోపించారు.
డ్రైవర్ చర్యల వల్ల ప్రయాణికులు తమ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సి వచ్చిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వేగంగా వెళ్తున్న బస్సును నడుపుతూనే మ్యాచ్‌పై దృష్టి పెట్టడం వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
గతంలో కర్ణాటకలో జరిగిన బస్సు ప్రమాదాన్ని గుర్తుచేస్తూ, ఇలాంటి నిర్లక్ష్య డ్రైవింగ్ వల్ల ప్రమాదాలు జరిగితే బాధ్యత ఎవరు తీసుకుంటారని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు.
ఈ ఘటనపై అధికారులు వెంటనే స్పందించి డ్రైవర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి నిర్లక్ష్య ధోరణి పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

إرسال تعليق