కరెంటు షాక్‌తో పంచాయతీ కార్యదర్శి మృతి

G Rajashekar
By -
0

 


EB NEWS/ఖమ్మం:


ఖమ్మం జిల్లా కారేపల్లిలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఏన్కూరు మండలం తిమ్మారావుపేట గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న సురేష్ ఆదివారం ఉదయం కరెంటు షాక్‌కు గురై మృతి చెందారు.


కారేపల్లిలోని తన నివాసంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగలడంతో అక్కడికక్కడే ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఘటన విషయం తెలుసుకున్న స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.


సురేష్ మృతితో ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. అలాగే ఆయన విధులు నిర్వహిస్తున్న తిమ్మారావుపేట గ్రామంలో కూడా విషాదఛాయలు అలముకున్నాయి. అధికారులు ఘటనపై వివరాలు సేకరిస్తున్నారు.


إرسال تعليق

0 تعليقات

إرسال تعليق (0)