మటన్ ఉడకలేదంటూ పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదు.. అనంతపురంలో వింత ఘటన

G Rajashekar
By -
0




 EB NEWS/AP


అనంతపురం జిల్లాలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. తాడిపత్రికి చెందిన ఓ వ్యక్తి ఉగాది పండుగ సందర్భంగా మటన్, తలకాయ కొనుగోలు చేశాడు. ఇంటికి వెళ్లి కుక్కర్లో మాంసాన్ని వండేందుకు ప్రయత్నించగా, సుమారు 20 సార్లు ఉడికించినా కూడా అది మెత్తబడలేదు.


దీంతో అసహనం చెందిన ఆ వ్యక్తి, తాను కొనుగోలు చేసిన మటన్ నాణ్యతపై అనుమానం వ్యక్తం చేస్తూ విక్రేతపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. వండిన పాత్రతో సహా స్టేషన్‌కు చేరుకున్న అతడిని చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు.


పోలీసులు అతనికి శాంతింపజేసి, ఇలాంటి విషయాలు పోలీస్ పరిధిలోకి రావని అర్థమయ్యేలా వివరించి ఇంటికి పంపించారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.


إرسال تعليق

0 تعليقات

إرسال تعليق (0)