భద్రాద్రిలో భారీ గంజాయి పట్టివేత.. రూ.52 లక్షల సరుకు స్వాధీనం!



EB NEWS/భద్రాద్రి:


 భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గురువారం జూలూరుపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పట్టుకున్నారు. మొత్తం 105.54 కిలోల గంజాయి, దాదాపు రూ.52.77 లక్షల విలువ కలిగిన సరుకును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 


 ఈ ఘటనలో నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకు చెందిన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో డొంకరాయి నుంచి శిరిడీకి గంజాయి తరలిస్తున్నట్లు బయటపడింది.


 ఈ కేసులో మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉండగా, వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ విషయాలను డీఎస్పీ వెల్లడిస్తూ, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Post a Comment

أحدث أقدم