మణుగూరు: గుండెపోటుతో రాజు కంప్యూటర్స్ అధినేత రాజు మృతి

G Rajashekar
By -
0



EB NEWS/మణుగూరు: 


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలో విషాదం చోటుచేసుకుంది. రాజు కంప్యూటర్స్ నిర్వహకుడు ఓబులాపూర్ రాజు ఈరోజు ఉదయం ఆకస్మిక గుండెపోటుతో మృతి చెందారు.


వేణు రెస్టారెంట్ సమీపంలోని తన కంప్యూటర్ సెంటర్‌లో ఉండగానే ఆయనకు గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందినట్లు సమాచారం.


రాజు మరణ వార్త తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు, స్నేహితులు, స్థానికులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ప్రాంతంలో ఆయనకు మంచి పేరుంది.


ఎంతోమందికి కంప్యూటర్ విద్య అందిస్తూ, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో రాజు కీలక పాత్ర పోషించారు. ఆయన మృతి స్థానికంగా తీరని లోటుగా భావిస్తున్నారు.


إرسال تعليق

0 تعليقات

إرسال تعليق (0)