ముల్లోకాలనేలే శివయ్యకే ఇల్లు ఇచ్చాడా? ఈ భక్తుడు

 


పినపాక, EB న్యూస్:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలం చిన్నరాజుపేట గ్రామంలో ఓ అపూర్వ భక్తి గాథ వెలుగులోకి వచ్చింది. తనకు ఇల్లు కట్టుకోమని అత్తగారు ఇచ్చిన చిన్న భూమి ముక్కను, ఆదివాసి యువకుడు పాయం సోమయ్య స్వంత అవసరానికి కాకుండా ముల్లోకాలాధిపతి శివయ్య సేవకు అంకితం చేశాడు.

సొంత ఇంటి కలను పక్కనబెట్టి, ఆ స్థలంలో చిన్న శివాలయాన్ని నిర్మించాడు. “నా కోసం ఇల్లు కట్టుకుంటే అది ఒక్క కుటుంబానికే… కానీ శివయ్య ఆలయం అయితే గ్రామమంతటికీ” అనే ఆయన భావన గ్రామస్థులను కదిలిస్తోంది.

ఆలయం నిర్మాణంతో ఆగిపోకుండా, గత ఎనిమిదేళ్లుగా ప్రతిరోజూ శుభ్రత, నిత్య పూజలు, మహాశివరాత్రి ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తూ తన జీవితం శివారాధనగా మార్చుకున్నాడు. జాతీయ రహదారి పక్కన ఉండటంతో గోదావరి పరక్రమ యాత్రికులు కూడా ఈ ఆలయాన్ని దర్శించి ఆధ్యాత్మిక ప్రశాంతతతో ముందుకు సాగుతున్నారు.

స్వార్థం పెరిగిన ఈ కాలంలో, భక్తి అంటే కేవలం ప్రార్థన కాదని — త్యాగం, సమర్పణ, సేవ అని తన జీవితంతో నిరూపించిన ఈ ఆదివాసి యువకుడు నిజంగా శివభక్తుల్లో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించాడు.

Post a Comment

కొత్తది పాతది