మంత్రి సీతక్క ఆదేశాలతో నిరుపేద మహిళకు ఆత్మ చైర్మన్ పదవి

 


ములుగు జిల్లా, EB న్యూస్:


మంత్రి ధనసరి సీతక్క ఆదేశాలతో ములుగు జిల్లాలోని ఏటూరునాగారం, మంగపేట, తాడ్వాయి, కన్నాయిగూడెం, గోవిందరావుపేట, వాజీడు, వెంకటాపురం మండలాల ఆత్మ చైర్మన్‌గా కర్ల అరుణ నియమితులయ్యారు. నిరుపేద మహిళా కుటుంబానికి చెందిన అరుణ ఈ బాధ్యత దక్కడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. గత 30 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలను గుర్తించి ఈ అవకాశం కల్పించిన మంత్రి సీతక్క గారికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో అధికారుల సమక్షంలో ప్రమాణస్వీకారం జరగనుంది.

Post a Comment

కొత్తది పాతది